ఈశ్వరాచారి త్యాగం మరువలేనిది
హుజూర్‌నగర్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలులో అన్యాయం జరిగింద ట హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారి త్యాగం మరువలేనిదని బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు ధూళిపాల శ్రీనివాసరావు అన్నారు. సాయి ఈశ్వరాచారిని త్యాగాన్ని స్మరిస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హుజూర్‌నగర్‌లోని మిర్యాలగూడ రోడ్డు చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి ఈశ్వరాచారి త్యాగం ప్రతి బీసీ బిడ్డ గుండెలో చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. పోరాడి మన హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈశ్వరాచారి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా అందించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు ఓరుగంటి మధు, చేపూరి నరసింహాచారి, చిలకరాజు అజయ్ కుమార్, కర్నె కృష్ణ, శెట్టి శ్రీనివాస్, వట్టికూటి శ్రీనివాస్‌గౌడ్, కొట్టు శేఖర్, ఎస్‌కే.హసన్మియా, జి.సైదులు యాదవ్, కాలువ పెదవెంకటేశ్వరావు, బ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు.


