సమస్యాత్మక పల్లెలపై పక్కా నిఘా
అర్వపల్లి : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై పక్కా నిఘా ఉంచినట్లు జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు తెలిపారు. సమస్యాత్మక గ్రామమైన జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో ఆదివారం పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సమాగ్రిని ఆయన పరిశీలించారు. అనంతరం అర్వపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ రిజిస్టర్లు పరిశీలించి ఓటింగ్ ప్రక్రియపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఝాన్సీ, తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్‌ఐ సైదులు, ఎంపీఓ గోపి, సీనియర్ అసిస్టెంట్ నర్సింహరాజు, సిబ్బంది సైదులు, నాగరాజు, వెంకన్న, మల్లయ్య, స్టేజ్–2 అధికారులు పాల్గొన్నారు.


