ముగిసిన మూడవ విడత నామినేషన్లు
నామినేషన్ల వివరాలు
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో శుక్రవారం మూడవ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. హుజూర్‌నగర్, చింతలపాలెం, నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి, మఠంపల్లి, మేళ్లచెరువు మండలాల్లోని ఆయా క్లస్టర్ సెంటర్లలోకి సాయంత్రం ఐదు గంటలకు వరకు చేరుకున్న వారి నామినేషన్లను అర్ధరాత్రి వరకు అధికారులు స్వీకరించారు. పలు కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకులు రవినాయక్, శ్రీను, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సందర్శించి పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రి 11.30 గంటల వరకు హుజూర్‌నగర్, పాలకవీడు, గరిడేపల్లి మండలాల్లోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా మిగతా నేరేడుచర్ల, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో కొనసాగుతూనే ఉంది.
మండలం సర్పంచ్ వార్డులు
హుజూర్‌నగర్ 73 324
పాలకవీడు 166 467
గరిడేపల్లి 228 785
(మిగతా మండలాల్లో ప్రక్రియ కొనసాగుతూనే ఉంది)
ఫ హుజూర్‌నగర్ డివిజన్‌లో
చివరి రోజు భారీగా దాఖలు
ఫ అర్ధరాత్రి వరకు క్యూకట్టిన అభ్యర్థులు


