సమగ్ర వ్యవసాయ పద్ధతులు పాటించాలి
గరిడేపల్లి : రైతులు సమగ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ నేల కోతను అరికట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి జి.శ్రీధర్‌రెడ్డి, కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, హెడ్ ఇన్‌చార్జి డి.నరేష్ అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన కిసాన్ మేళాకు హాజరయ్యారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన డెమోస్‌ని చూసి రైతులకు ఉపయోగపడే ప్రకృతి వ్యవసాయాన్ని తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు నరేష్, కిరణ్, పి.అక్షిత్‌సాయి, సుగంధి, నూతనకల్ మండల వ్యవసాయ అధికారి మల్లారెడ్డి, కంప్యూటర్ ప్రోగ్రామర్ నరేష్ రైతులు పాల్గొన్నారు.
ఫ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి


