సర్పంచ్ బరిలో 471 మంది
భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికల తొలి విడత సమరానికి అభ్యర్థులు ఖరారయ్యారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుదిపోరులో నిలిచే అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. సర్పంచ్ పదవులకు 471 మంది, వార్డులకు 2736 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఏడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇవే కాకుండా 193 వార్డు స్థానాలకు ఒకటే నామినేషన్ ఉండడంతో ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని తుంగతుర్తి, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం, నూతనకల్, తిరుమలగిరి, నాగారం, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామపంచాయతీలు, 1,442 వార్డులకు ఈనెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించిన గుర్తులను అధికారులు కేటాయించారు. ఈ గుర్తులతోనే అభ్యర్థులు గురువారం నుంచి ప్రచారానికి వెళ్లనున్నారు.
బరిలో నిలిచే జాబితా విడుదల..
తొలివిడత ఎన్నికల కోసం నవంబర్ 27వ తేదీన నోటిఫికేషన్ జారీ కాగా.. మూడురోజుల పాటు నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్‌లకు 1,387 నామినేషన్లు, వార్డులకు 3,791 నామినేషన్లు వచ్చాయి. ఇదేనెల 30న నామినేషన్లను పరిశీలించారు. డిసెంబర్ 1న అభ్యంతరాలు స్వీకరించి 2వ తేదీ నాటికి పరిష్కరించారు. బుధవారం విత్‌డ్రాలకు అవకాశం కల్పించడంతో పొత్తులు కుదరడంతో పాటు ఎన్నికల్లో గెలుపోటములు, పార్టీల మద్దతు.. ఇలా పలు సమీకరణలతో నామినేషన్లు వేసిన ఆశావహులు భారీగానే తమ నామనేషన్ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. దీంతో అధికారులు ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులతో కూడిన జాబితాలను విడుదల చేశారు.
ఆత్మకూర్ (ఎస్) నుంచే పోటీ ఎక్కువ..
సర్పంచ్ పదవుల కోసం ఆత్మకూర్ (ఎస్) మండలం నుంచే అధిక పోటీ నెలకొంది. ఇక్కడ మొత్తం 30 గ్రామపంచాయతీలు ఉండగా 257 మంది ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేయగా.. చివరకు 92 మంది అభ్యుర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తుంగతుర్తి మండలం నుంచి 222 మంది నామినేషన్లు వేయగా ఎన్నికల బరిలో 78 మంది ఉన్నారు. నాగారంలో 48 మంది, నూతనకల్‌లో 40 మంది, తిరుమలగిరిలో 29, జాజిరెడ్డిగూడెంలో 64 మంది, మద్దిరాాలలో 40మంది, సూర్యాపేటలో 80 మంది చొప్పున సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక వార్డు సభ్యుల బరిలోనూ ఆత్మకూర్ (ఎస్) నుంచే అత్యధికంగా 526 మంది ఉన్నారు. ఇక్కడ 274 వార్డులు ఉన్నాయి. అత్యల్పంగా సూర్యాపేట మండలం నుంచి 178 ఎన్నికల్లో పోటీ పడనున్నారు.
ఊపందుకోనున్న ప్రచారం..
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తులు ఖరారు కావడంతో తొలి విడత ఎన్నికలు జరిగే 159 గ్రామపంచాయతీల్లో గురువారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది. ఇప్పటికే ఆయా పార్టీల మద్దతు ఇవ్వగా, గుర్తులతో కూడిన పత్రాలను ముద్రించి ఇంటింటికీ తిరగనున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు సైతం ఇప్పటికే ఫోన్ల ద్వారా అభ్యర్థులు సంప్రదిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమకే మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
గ్రామ పంచాయతీలు
158
ముగిసిన తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ
ఏడు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
వార్డులకు 2,736 మంది,
మరో 193 వార్డులు ఏకగ్రీవం
అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు..
ఇక ప్రచారమే..
11న ఎన్నికల పోలింగ్
బరిలో మిగిలింది వీరే
వార్డు స్థానాలు
1,442
07 ఏకగ్రీవం
152 ఎన్నికలు జరిగేవి
1387 నామినేషన్లు
916 విత్‌డ్రా
471 పోటీలో ఉన్నది
193
1,249
3,791
1055
2,736


