మఠంపల్లి చర్చిలో దివ్యబలి పూజ
మఠంపల్లి: మఠంపల్లి పట్టణంలోని శౌరీనగర్‌లోగల శౌరి చర్చి వార్షికోత్సవం సందర్భంగా బుధవారం దివ్యబలిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ రాజిరెడ్డి క్రైస్తవులకు ఉపదేశం చేశారు. ఏసుక్రీస్తు బోధనలు లోకవ్యాప్తంగా ప్రచారం చేసిన శౌరి పునీతుడయ్యాడన్నారు. అనంతరం సత్‌ప్రసాదం పంపిణీచేశారు. క్రైస్తవ గేయాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో పలువురు గురువులు, చర్చికమిటీ పెద్దలు, క్రైస్తవులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థుల ఆరోగ్యంపై నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధవహించాలని సూర్యాపేట జిల్లా కోర్టు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత సూచించారు. వికలాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం సూర్యాపేట మండలం కాసరబాద గ్రామ శివారులోని బధిరుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సైనింగ్ భాష మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు. డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, న్యాయవాదులు సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
170 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు
నేరేడుచర్ల : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 170 సమస్యాత్మక గ్రామాలను గుర్తించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం నేరేడుచర్ల మండలం దిర్శించర్లలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌బీ సీఐ రామారావు, హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, తహసీల్దార్ సైదులు, ఎస్‌ఐ రవీందర్‌నాయక్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని పోలీస్ అధికారులు దివ్యాంగుల సమస్యల పరిష్కరిస్తారని ప్రత్యేక చొరవ చూపుతారని ఏఎస్పీ రవీందర్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహరావు అధ్యక్షతన జిల్లాస్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు నిమిత్తం వచ్చే దివ్యాంగుల స్కూటీలను అనుమతిస్తామని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి దివ్యాంగులకు వచ్చే అన్నిరకాల పథకాలను అందిస్తున్నామన్నారు. అనంతరం ఇటీవల జిల్లాకేంద్రంలో దివ్యాంగులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి, జిల్లా వైద్యాధికారి వెంకట రమణ, డీసీహెచ్ వెంకటేశ్వర్లు, అధికారులు నాగప్రసాద్, బెనర్జీ పాల్గొన్నారు.
మఠంపల్లి చర్చిలో దివ్యబలి పూజ
మఠంపల్లి చర్చిలో దివ్యబలి పూజ


