ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి
నేరేడుచర్ల : పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు రవినాయక్ సూచించారు. బుధవారం నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి, దిర్శించర్ల గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నియమ, నిబంధనలను తప్పని సరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సురిగి సైదులు, ఎంపీడీఓ సోమ సుందర్‌రెడ్డి, ఎంపీఓ నాగరాజు, ఎస్‌ఐ రవీందర్‌నాయక్ ఉన్నారు.
తప్పిదాలకు తావివ్వొద్దు
పెన్‌పహాడ్: నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో తప్పిదాలకు తావివ్వొద్దని అధికారులు పనిచేయాలని ఎన్నికల పరిశీలకుడు రవినాయక్ సూచించారు. బుధవారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని దూపహాడ్‌లో నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయడానికి అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఎన్నికల సంఘం నియమావళికి అనుగుణంగా ఉండాలన్నారు. తహసీల్దార్ లాలు, ఎంపీడీఓ జానయ్య, ఎస్‌ఐ గోపికృష్ణ పాల్గొన్నారు.


