కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలి
హుజూర్‌నగర్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ మద్దతుదారులను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. బుధవారం హుజూర్‌నగర్ మండలం మర్రిగూడేనికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు తోట భిక్షం, వార్డు మాజీ సభ్యుడు తోట కోటేశ్వరరావు, చిల్ల అశోక్, శ్రీనివాసరావు, గోవిందరాజు, ప్రవీణ్ రాంప్రసాద్ లతో పాటు దాదాపు 50 కుటుంబాలకు చెందిన వారు పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి మంత్రి కాంగ్రెస్ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు తోడ్పాటు అందించాలని అన్నారు. అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యరగానీ నాగన్న గౌడ్, దొంగరి వెంకటేశ్వర్లు, అరుణ్ కుమార్ దేష్‌ముఖ్, గూడెపు శ్రీనివాస్, అజ్మతుల్లా, రబ్బాని, మౌలానా, ఆదినారాయణ, జాన్ మియా పాల్గొన్నారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


