ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగేలా చూడాలి
పెన్‌పహాడ్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెంచేలా ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌ఓ వెంకటరమణ కోరారు. మంగళవారం పెన్‌పహాడ్‌మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆశా డే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గర్భిణుల పరీక్షలపై దృష్టి పెట్టాలని సూచించారు. పిల్లల టీకాల కార్యక్రమాన్ని 100శాతం సంపూర్ణంగా పూర్తి చేయాలన్నారు. గ్రామీణ ప్రజలకు టెలిమెడిసిన్ సేవలను చేరవేయడంలో ఆశాకార్యకర్తలు, ఎల్‌హెచ్‌పీలు మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎంఓ ఆనంద్, సీహెచ్‌ఓ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ వెంకటరమణ


