ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ కె.సీతారామారావు సూచించారు. మంగళవారం చివ్వెంల మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ జి.చంద్ర శేఖర్, ఎంపీడీఓ సీహెచ్. సంతోష్ కుమార్, ఎంపీఓ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ కేంద్రాల పరిశీలన
పెన్‌పహాడ్ : పెన్‌పహాడ్ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అనంతారంలోని నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ సీతారామారావు మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా దాఖలైన నామినేషన్లు, జారీ చేసిన నామినేషన్ పత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హెల్ప్‌డెస్క్ పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జానయ్య, తహసీల్దార్ లాలు, ఎంపీఓ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సీతారామారావు


