కోదాడ: నల్లగొండ జిల్లా హలియాలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే 51వ జూనియర్ బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనే సూర్యాపేట జిల్లా జట్టును ఆదివారం కోదాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్‌రెడ్డి, నామా నరసింహారావు తెలిపారు. జట్టు కెప్టెన్ జి. శ్రీజా, బి లహరి, ఎం. వైష్ణవి, ఎ. దివ్య, ఆర్. దీప్తి, బి.అక్షర, సీహెచ్. అమూల్య, ఎం. సాహిత, టి. హర్షిత, కె. కళ్యాణి, పి. నందిని, అక్షయ, ఎం. శివాణి, ఎన్. శ్రీలేఖ, గంగోత్రిలను ఎంపిక చేసినట్లు వివరించారు. వీరికి కోచ్‌గా టి. రమేష్‌బాబు వ్యవహరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో శెట్టి రామచందర్‌రావు, మాతంగి సైదులు, బసవయ్య తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఐవీపై ప్రజలు
అవగాహన కలిగి ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : హెచ్‌ఐవీపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం సూర్యాపేట పట్టణంలోని జనరల్ హాస్పిటల్‌లో రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు. మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. ఎయిడ్స్ వ్యాధికి మందులు లేవని, నివారణ ఒక్కటే మార్గం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, మీడియేషన్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్‌రావు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
ఎన్నికల కమిషన్
నిబంధనలు పాటించాలి
మునగాల: ఈనెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు పాటించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ సూచించారు. సోమవారం ఆయన మునగాల గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. స్వీకరించిన నామినేషన్లను ఎప్పటికప్పుడు టీ ఫోన్‌లో ఎంట్రీ చేయాలన్నారు. నామినేషన్ కేంద్రంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. చివరి రోజు నామినేషన్లు వేసేందుకు అధిక సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంటన ఎంపీడీఓ కె.రమేష్‌దీనదయాళ్, తహసీల్దార్ వి.సరిత, ఆర్‌ఐ ఎన్.రామారావు, ఎంపీఓ నరేష్, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.
రేపు ఉమ్మడి జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–19 బాలబాలికల బాస్కెట్ బాల్ జిల్లా జట్ల ఎంపికలు ఈ నెల 3న నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ అండర్–19 కార్యదర్శి కుంభం నర్సిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్, 10వ తరగతి మెమో తీసుకొని ఉదయం 9 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఫోన్ : 8096745465 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
జిల్లా బాలికల కబడ్డీ జట్టు ఎంపిక
జిల్లా బాలికల కబడ్డీ జట్టు ఎంపిక


