కారణాలు చెప్పకుండా తిరస్కరించారని.. | - | Sakshi
Sakshi News home page

కారణాలు చెప్పకుండా తిరస్కరించారని..

Dec 2 2025 7:26 AM | Updated on Dec 2 2025 7:26 AM

కారణాలు చెప్పకుండా తిరస్కరించారని..

కారణాలు చెప్పకుండా తిరస్కరించారని..

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌, వార్డుసభ్యుల ఎన్నికల కోసం వేసిన నామినేషన్లను అధికారులు పరిశీలన సమయంలో ఎలాంటి కారణాలు చెప్పకుండా తిరస్కరించడంపై ఆత్మకూర్‌(ఎస్‌) మండలం పాతర్లపహాడ్‌, తుమ్మలపెన్‌పహాడ్‌ గ్రామాల్లో క్లస్టర్ల వద్ద బాధితులు ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం ముగియడంతో ఆదివారం నామినేషన్లను అధికారులు పరిశీలించాల్సి ఉంది. అర్ధరాత్రి దాకా పరిశీలించి కొందరి నామినేషన్లలో తప్పులు ఉన్నాయని రిజెక్ట్‌ చేశారు. సోమవారం రిజెక్ట్‌ అయిన నామినేషన్‌ పత్రాలను ఆర్డీఓకు అప్పీలు చేసుకోవాలని చెప్పారు. అయితే తిరస్కరణకు గురికావడానికి గల కారణాలను చెప్పకపోవడంతో ఆర్డీఓకు ఎలా అప్పీల్‌ చేసుకోవాలని బాధితులు ఆందోళన చేశారు. అధికారులు.. అభ్యర్థులకు మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు కొనసాగాయి. తర్వాత క్లస్టర్‌ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ హసీం, తహసీల్దార్‌ అమీన్‌ సింగ్‌, ఎస్సై శ్రీకాంత్‌ గౌడ్‌ అక్కడికి చేరుకొని నామినేషన్లలో జరిగిన తప్పులను రిటర్నింగ్‌ అధికారి చదివి వినిపించారు. దాంతో ఆందోళన విరమించి ఆర్డీఓ అప్పీల్‌కు వెళ్లారు. అదేవిధంగా తుమ్మల పెన్‌పహాడ్‌ క్లస్టర్లో ఆదివారం రాత్రి వరకు సాగిన నామినేషన్ల పరిశీలనలో కోటపాడుకు చెందిన రెండు వార్డుల నామినేషన్‌ పత్రాలలో తప్పులు ఉన్నాయని రిజెక్ట్‌ చేస్తున్నట్లుఅధికారులు ప్రకటించారు. సోమవారం ఉదయం తప్పులు ఉన్న నామినేషన్‌ పత్రాలను అధికారులు గ్రీన్‌ ఇంకుతో సరిచేసి తప్పులను చూపించిన పత్రాలపై కొట్టివేతలు ఉండడంతో బాధితులు ఆందోళనకు దిగారు. రిజెక్ట్‌ అయిన నామినేషన్‌ పత్రాలను కొందరు నాయకుల ప్రమేయంతో అధికారులు సరిచేయడం మరికొందరివి రిజెక్ట్‌ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. అధికారులు అక్కడికి చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రిజెక్ట్‌ అయిన నామినేషన్‌ వివరాలను అభ్యర్థులకు అందజేసి ఆర్డీఓ కు అప్పీల్‌ చేసుకోవాలని సూచించారు. దాంతో ఆందోళ వివరించారు.

ఫ నామినేషన్‌ క్లస్టర్ల వద్ద

బాధితుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement