రాష్ట్రస్థాయి ‘ఆర్చరీ’కి 12 మంది ఎంపిక
భువనగిరి: రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన 12 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు.భువనగిరిలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ స్కూల్ మైదానంలో బుధవారం ఉమ్మడి నల్లగొండ ఆర్చరీ ఎంపిక పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో 25 మంది క్రీడాకారులు పాల్గొనగా.. ప్రతిభ కనబరచిన 12 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామని, ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, టి.విద్యాసాగర్ తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో ఈ నెల 9, జూనియర్ విభాగంలో 16వ తేదీన హైదరాబాద్‌లో పోటీలు ఉంటాయని, క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, మానసికోల్లాసం పెంపొందడానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సుభాష్‌రెడ్డి, టీజీపీఈటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజుగౌడ్, ఉపాధ్యక్షుడు స్వామిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, పీఈటీ విష్ణువర్ధన్‌రెడ్డి, కోచ్ సాయిరాం పాల్గొన్నారు.
రాష్ట్రసాయికి ఎంపికై న క్రీడాకారులు
బి.హర్ష, సూర్యతేజ, టి.అభినవ్, సాయివిష్ణు, నిహల్‌రెడ్డి, విఖ్యా, హర్షవర్థన్‌రెడ్డి, షేక్‌హస్న, అక్షిత, విశ్రుత, శ్రీలక్ష్మీ, నూర్‌సభ రాష్ట్రస్థాయి అర్చరీ పోటాలకు ఎంపికయ్యారు.


