గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి
కోదాడ రూరల్ : పశువులకు తప్పకుండా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని గాలికుంటు నివారణ టీకా రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ కె.అనిల్‌కుమార్ సూచించారు. బుధవారం కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో కొనసాగుతున్న గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యంగా 7వ విడత టీకాల పంపిణీని పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల పశువులకు గాను 70శాతం మేర టీకా పంపిణీ పూర్తి అయిందని తెలిపారు. కోదాడ పశువైద్యశాలలో 4000 వేల పశువులకు గాను 3300 పశువులు టీకాలు వేసి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ పశువైద్యశాలలో నిర్వహిస్తున్న పశుఔషధ బ్యాంకును పరిశీలించారు. ఔషధ బ్యాంకు ఏర్పాటు చేసి తక్కువ ధరకే పాడి రైతులకు , జీవాల పెంపకం దారులకు క్యాల్షియం, మినరల్ మిక్చర్‌తో పాటు పలు రకాల మందులను అందజేస్తున్న డాక్టర్ పెంటయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.పెంటయ్య, కోదాడ, అనంతగిరి పశువైద్యాధికారులు డాక్టర్ వీరారెడ్డి, డాక్టర్ సురేంద్ర, సిబ్బంది రాజు, చంద్రకళ ఉన్నారు.
ఫ రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ అనిల్‌కుమార్


