వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Oct 30 2025 7:53 AM | Updated on Oct 30 2025 7:53 AM

వ్యక్

వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

చివ్వెంల(సూర్యాపేట) : వ్యక్తిగత ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద సూచించారు. బుధవారం సూర్యాపేట జనరల్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆమె మాట్లాడారు. ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యులను సంప్రదిస్తూ ముందుకెళ్లాలన్నారు. శరీరంలో వచ్చిన మార్పును చిన్నదిగా భావించకుండా, పనిలో పడి అది ప్రాణాంతకం కాకముందే చూపించుకోవాలన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకుని అవసరమైన చికిత్స తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్‌ కౌసర్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి అపూర్వ రవళి, సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ బి.వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ పి.విజయ మనోని, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, డాక్టర్‌ వై. శ్రీశైలం పాల్గొన్నారు.

మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం

హుజూర్‌నగర్‌ : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృ తాభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తికట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తంలబ్రాలతో నిత్య కల్యాణతంతు ముగించారు. నీరాజన మంత్రపుష్పాలతో మహా నివేదనచేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ నవీన్‌కుమార్‌, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, ఆంజనేయాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

పశువైద్య సిబ్బంది

అందుబాటులో ఉండాలి

కోదాడరూరల్‌ : మోంథా తుపాను తో భారీ వర్షాలు కురుస్తున్నందున పాడి రైతులు, జీవాల పెంపకం దారులకు ఇబ్బంది కలగకుండా పశువైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు. బుధవారం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. వర్షంలో కూడా సిబ్బంది పశుపోషకులకు వైద్య సేవలు చేయడాన్ని ఆయన అభినందించారు. పశుపోషకులకు ఆసరాగా ఉండేందుకు ఏర్పాటు చేసిన పశు ఔషధ బ్యాంకు ద్వారా డాక్టర్‌ పెంటయ్య రూ. 3.6 కోట్ల అదనపు సంపద సృష్టించి సేవలు అందించడం పశుసంవర్ధక శాఖ చరిత్రలో ఓమైలురాయని పేర్కొన్నాడు. వర్షాల నేపథ్యంలో పశువులను లోతట్టు ప్రాంతాల్లో కట్టయ్యొద్దని, కాల్వలు, నది తీరాల వెంట మేతకు పంపవద్దని, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండే లా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పశువ్యైశాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పెంటయ్య, సిబ్బంది ఉన్నారు.

వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
1
1/1

వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement