 
															వంతెనల వద్ద పోలీస్ పికెట్
● ఎస్పీ నరసింహ
సూర్యాపేటటౌన్ : మోంథా తుపాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందు వల్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కోరారు. ఎక్కడైనా రోడ్లపై నుంచి నీటి ప్రవాహం ఉధృతంగా ఉంటే అలాంటి కల్వ ర్టులు, వంతెనలు దాటవద్దని, ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ అంతా అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది అంతా సెలవులు రద్దుచేసుకొని విధుల్లో ఉన్నట్లు తెలిపారు. వంతెనలు, కల్వర్టు ల వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని, వరద నీరు వంతనెలపై నుంచి ప్రవహిస్తే వాహనాలతో వంతెనలు దాటవద్దని కోరారు. ప్రజలు పోలీసు వారి సూచనలు పాటించాలని, అత్యవసర సమయంలో డయల్ 100, సూర్యాపేట పోలీస్ కంట్రోల్ రూమ్ కు నంబర్ 8712686026కు ఫోన్ చేయాలని సూచించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
