రైతులకు తీవ్ర నష్టం..
తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. దాదాపు 40నుంచి 50వేల ఎకరాల వరి వరదలోనే ఉండిపోవడంతో దీనిప్రభావం దిగుబడిపై పడనుంది. నాణ్యత లేకుండా వరికోతల సమయంలో తీవ్ర ఇక్కట్లకు రైతులు గురి కానున్నారు. జిల్లాలో పత్తితీతకు ఉన్న పంట సైతం గింజలు మొలకెత్తనున్నాయి. తేమశాతం పెరిగిపోయి పత్తి నల్లబడిపోతోంది. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో ఇప్పుడిప్పుడే ఈత దశలో ఉన్న పొలాలు సైతం నేలబారాయి. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం రాశులు అక్కడక్కడా కొట్టుకుపోయాయి. జిల్లాలో పంట నష్టంపైఅధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఒకటిరెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.


