చెరువులను కాపాడాలని మంత్రికి వినతి | - | Sakshi
Sakshi News home page

చెరువులను కాపాడాలని మంత్రికి వినతి

Oct 29 2025 7:35 AM | Updated on Oct 29 2025 7:35 AM

చెరువ

చెరువులను కాపాడాలని మంత్రికి వినతి

హుజూర్‌నగర్‌ : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన చెరువులను కాపాడాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మత్స్యసహకార శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి సూర్యాపేట జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘం జిల్లా ప్రమోటర్‌ పేరబోయిన వీరయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ప్రతి సంవత్సరం చెరువుల్లో నీరు తగ్గినప్పుడల్లా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ప్రోత్సహించేందుకు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తోందని, కానీ చేప పిల్లల నాణ్యత లోపంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రికి వివరించారు.

70శాతం హాజరు ఉంటేనే పరీక్ష ఫీజు తీసుకోవాలి

కోదాడ : విద్యార్థుల హాజరు 70 శాతం ఉంటేనే పరీక్ష ఫీజు తీసుకోవాలని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి భాను నాయక్‌ కోరారు. మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను తనిఖీ చేసిన అనంతరం అధ్యాపకులు, విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మట్లాడారు. వచ్చే నెల 1 నుంచి 90 రోజుల ప్రణాళికలో విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొని, వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ప్రతి జూని యర్‌ కళాశాలలో డిజిటల్‌ బోర్డులను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్‌ డి.విజ య నాయక్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

సూర్యాపేటటౌన్‌ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్‌ వీరబోయిన లింగయ్య యాదవ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారన్నారు. అదే విధంగా పై చదువులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బయ్య రాజేష్‌, శైలజ, విజయ కుమారి, లక్ష్మి, పల్లవి, సంధ్య, సింధు, సుజాత, భవాని, కవిత, గణిత, సరిత, విద్యార్థులు పాల్గొన్నారు.

రేపు సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సమావేశం

సూర్యాపేట అర్బన్‌: ఈనెల 30న హుజూర్‌నగర్‌లో జిల్లా స్థాయి కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు వెల్లడించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ధర్మభిక్షం భవన్‌లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, శాసన మండలి సభ్యుడు నెల్లికంటి సత్యం, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్‌, గన్నా చంద్రశేఖర్‌ హాజరవుతారని వివరించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మండవ వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు దంతాల రాంబాబు, పద్మ రేఖ, దేశగాని హేమలత, గాలి కృష్ణ, చిట్టిప్రోలు కోటయ్య పాల్గొన్నారు.

చెరువులను కాపాడాలని మంత్రికి వినతి1
1/2

చెరువులను కాపాడాలని మంత్రికి వినతి

చెరువులను కాపాడాలని మంత్రికి వినతి2
2/2

చెరువులను కాపాడాలని మంత్రికి వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement