ప్రజలకు సుపరిపాలన అందించాలి
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
సూర్యాపేట : ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు సుపరిపాలన అందించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవంలో పాల్గొని అధికారుతో ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు సరైన రీతిలో ప్రజలకు చేరే విధంగా పారదర్శకతతో అర్హులను గుర్తించాలన్నారు. అధికారులు విధి నిర్వహణలో ఏమైనా తప్పు చేసిన, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగినా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ లోతుగా విచారణ చేస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, విజిలెన్స్ అధికారులు దశరథ, రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


