నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి
సూర్యాపేటటౌన్ : నేరాల నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఎస్పీ నరసింహ సూచించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి గత నెలలో జరిగిన నేరాల స్థితిగతులను సమీక్షించారు. అనంతరం కేసుల ఫైళ్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేర నిరూపణలో సిబ్బంది సాంకేతిక సామర్థ్యం కలిగి ఉండాలని, ఫిర్యాదులపై త్వరగా స్పందించి సంఘటనా స్థలానికి త్వరగా చేసుకోవాలన్నారు. రాత్రిళ్లు పెట్రోలింగ్ పటిష్టంగా చేయాలని సూచించారు. కేసులు పెండింగ్ లేకుండా వేగంగా దర్యాప్తు చేయాలన్నారు. కేసుల్లో నేరస్తులకు త్వరగా శిక్షలు పడేలా పని చేయాలన్నారు. పోలీసులు వేగవంతమైన సేవలు అందించినప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒక్క ప్రాణం కూడా పోకుండా సిబ్బంది పని చేయాలని సూచించారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ వాహన దారులు, ప్రజలను రోడ్డు భద్రత పై అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అడ్మిన్ అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


