జాబ్‌మేళా విజయవంతానికి సహకరించాలి
హుజూర్‌నగర్ : ఈ నెల 25న హుజూర్‌నగర్‌లో నిర్వహించే మెగా జాబ్‌మేళాను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జాబ్‌మేళా ఏర్పాట్లను మంగళవారం నాయకులు, అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జాబ్‌మేళాపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామన్నారు. జాబ్‌మేళాకు వచ్చే అభ్యర్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్థానిక నాయకులతో కమిటీ వేసి రిజిస్ట్రేషన్ కౌంటర్లు, కంపెనీల స్టాల్స్ వద్ద, భోజనాలు వద్ద రద్దీ కారణంగా ఇబ్బందులు కలుగకుండా చూడాలని మంత్రి సూచించారు. జాబ్‌మేళాకు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు ఎక్కువ కంపెనీలను ఆహ్వానించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ, డీట్ ప్రతినిధి వంశీ, సింగరేణి ప్రతినిధులు రామస్వామి, తుకారం, రవికుమార్, సుఽంకర్, కోఆర్డినేటర్ చందర్, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు తన్నీరు మల్లిఖార్జున్, గెల్లి రవి, కోతి సంపత్‌రెడ్డి, దొంతగాని శ్రీనివాస్, డీవీ, శివరాం యాదవ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


