ఇంటర్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ఇంటర్ వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని డీఐఈఓ భానునాయక్ సూచించారు. గురువారం ఆత్మకూర్(ఎస్)మండలంలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఇప్పటినుంచే వారికి కావాల్సిన మెటీరియల్ అందించాలన్నారు. ప్రతి విద్యార్థి రోజూ కళాశాలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. క్లాస్ ఇన్‌చార్జిలు ప్రతి తరగతిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, తరగతులకు హాజరుకాని విద్యార్థులను ఫోన్ ద్వారా సంప్రదించి కళాశాలకు రప్పించాలన్నారు. ఇంటర్ విద్యా కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల ప్రకారం యూడైస్, ఎంఆర్‌ఎచ్ పూర్తికాని విద్యార్థులకు పరీక్ష ఫీజులు తీసుకునేది లేదన్నారు. ప్రతి విద్యార్థి హాజరు శాతం 70 ఉండాలని లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. కళాశాలలో డిజిటల్ పాఠాలు బోధించేందుకు ప్రత్యేకంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కాల్వ మరమ్మతులకు ప్రతిపాదనలు
కోదాడరూరల్ : గణపవరం మేజర్ కాల్వ మరమ్మతులకు ప్రతిపాదనలు పంపనున్నట్లు ఎన్నెస్పీ ఈఈ సత్యనారాయణ తెలిపారు. కోదాడ మండల పరిధిలోని గణపవరం మేజర్ కాల్వ చివరి గ్రామమైన గణపవరంలో కాల్వ అధ్వానంగా మారింది. కాల్వ చివరికి వచ్చే వరకు కట్టలు బలంగా లేకపోవడంతో నీరు ఎక్కువ వచ్చినపుడు, వర్షాలు కురిసినప్పుడు వరద ఎక్కువై కాల్వ పొంగి ఆ నీరంతా గ్రామంలోకి వస్తుందని ఇటీవల స్థానికులు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. దీంతో ఎన్నెస్పీ ఈఈ ఆధ్వర్యంలో గురువారం కాల్వలను పరిశీలించారు. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కాల్వపై కల్వర్టు సరిగ్గా లేదని, టవర్ నుంచి కింది వరకు కట్ట ఎత్తు పెంచి యూటీ నిర్మించాలని గ్రామస్తులు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇర్ల సీతరాంరెడ్డి, ఎన్నెస్పీ డీఈ సువర్ణరేఖ, ఏఈ ఉపేందర్, నాయకులు జాబిశెట్టి నాగప్రసాదద్, ఇర్ల నారపరెడ్డి, ఇర్ల లక్ష్మారెడ్డి, బండి చిన్న కోటయ్య, కాసాని సత్యం, గోపిరెడ్డి, గుర్వయ్య, వెంకన్న, ధనమూర్తి ఉన్నారు.
పీఆర్సీ తక్షణమే
అమలు చేయాలి
ఆత్మకూర్ (ఎస్) (సూర్యాపేట) : తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు తక్షణమే పీఆర్సీ అమలు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాపర్తి రామనరసయ్య, పుప్పాల వీరన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని ఆత్మకూరు, ఏనుబాముల, నెమ్మికల్, ఏవీకే తండా, ఇస్తళాపురం, కందగట్ల, పాత సూర్యాపేట, కోటినాయక్ తండా, కాల్‌భావ్‌సింగ్ తండా పాఠశాలల్లో టీపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 జూలై నెల నుంచి పీఆర్సీ అమలు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ని రూపొందించి శాశ్వత ప్రాతిపదికన మండల విద్యాధికారి, డీఈఓ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు టెట్ నిబంధనను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకయ్య, రాచూరి ప్రతాప్, పోతురాజు నరసయ్య, ఎస్‌కేఎం.సుభాని, ఎంఈఓ ధారాసింగ్, గెజిటెడ్ హెచ్‌ఎం శ్రవణ్‌కుమార్, బాసిత్, మల్లారెడ్డి, పోలిశెట్టి శ్రీనివాస్, బట్టిపల్లి వెంకన్న, గోపాల్, రామచంద్రయ్య, రఘు, నరసరాజు, రవి, రమేష్, ఝాన్సీ, మంగమ్మ, సరిత, కవిత, శ్రీదేవి, శిరీష పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలి
ఇంటర్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలి


