మద్యం దరఖాస్తులు 2,771
అత్యధికంగా బేతవోలు
వైన్స్‌కు 59 దరఖాస్తులు..
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని వైన్స్ షాపులకు టెండర్ల ప్రక్రియ గురువారం రాత్రితో ముగిసింది. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో మొత్తం 93 వైన్స్‌లకు అధికారులు టెండర్లు ఆహ్వానించగా సెప్టెంబర్ 26 నుంచి ఈ నెల18 వరకు మొదట దరఖాస్తులు స్వీకరించారు. కానీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ప్రభుత్వం ఈ నెల 23వ తేదీ వరకు గడువు పెంచడంతో జిల్లాలో గత గడువు కంటే అదనంగా రూ.4.62కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షల ఫీజుతో దరఖాస్తులను ఆహ్వానించగా మొదట నిర్దేశించిన గడువు 22రోజుల వరకు 1,274 దరఖాస్తులు రాగా ఈ నెల 18న ఒక్కరోజే 1,343 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత గడువు పెంచిన తర్వాత మూడు రోజుల్లో 154 దరఖాస్తులు రాగా మొత్తం గురువారం రాత్రి వరకు 2,771 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 27వ తేదీన కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా వైన్స్‌లను కేటాయించనున్నారు.
మద్యం టెండర్ల ద్వారా
రూ.83.13కోట్ల ఆదాయం
జిల్లాలోని 93 వైన్స్‌లకు గాను మొత్తం 2,771 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో సూర్యాపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 889, తుంగతుర్తి సర్కిల్ పరిధిలో లో 401, కోదాడ సర్కిల్‌లో 675, హుజూర్‌నగర్ సర్కిల్‌లో 806 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా సూర్యాపేట సర్కిల్, అత్యల్పంగా తుంగతుర్తి సర్కిల్‌లో దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని నాలుగు సర్కిళ్లలో ఈ నెల 18వ తేదీన అత్యధికంగా 1,343 దరఖాస్తులు రాగా గడువు పెంచిన తర్వాత గురువారం చివరి రోజు కావడంతో ఒక్క రోజే 142 దరఖాస్తులు వచ్చాయి.
గతంతో పోల్చితే రూ.3.63కోట్లు
తగ్గిన ఆదాయం
2023–25 సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా 99 వైన్స్‌లకు 4,338 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.86.76కోట్ల ఆదాయం వచ్చింది. అయితే 2025–27 సంవత్సరానికి గాను 93 వైన్స్‌లకు 2,771 దరఖాస్తులు వచ్చాయి. అయితే గతంలో కంటే ఇప్పుడు రూ.లక్ష ఫీజు అదనంగా పెంచడంతో దరఖాస్తు దారులు కొంత ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. దీంతో 2,771 దరఖాస్తుల ద్వారా రూ.83.13కోట్ల ఆదాయం మాత్రమే ఎకై ్సజ్ శాఖకు వచ్చింది. గతం కంటే ఈ సారి రూ.3.63కోట్ల మేర ఆదాయం తగ్గింది. అలాగే గతం కంటే 1567 దరఖాస్తులు కూడా తక్కువగా వచ్చాయి. కాగా ఈ సారి ఎక్సైజ్ అధికారులు ఆరు వైన్స్‌లకు అనుమతి ఇవ్వలేదు.
ముగిసిన టెండర్ల ప్రక్రియ
ఫ టెండర్ల ద్వారా ఆబ్కారీ శాఖకు రూ.83.13కోట్ల ఆదాయం
ఫ అత్యధికంగా సూర్యాపేట సర్కిల్‌లో 889 దరఖాస్తులు
ఫ గతంతో పోల్చితే తగ్గిన దరఖాస్తులు, ఆదాయం
ఫ 27న లాటరీ ద్వారా
మద్యం షాపుల కేటాయింపు
జిల్లాలోని 93 వైన్స్‌లకు టెండర్లను ఆహ్వానించగా ప్రతి వైన్స్‌కు సగటున 30 నుంచి 40 దరఖాస్తులు వచ్చాయి. అయితే అత్యధికంగా చిలుకూరు మండలం బేతవోలు వైన్స్‌కు 59 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా తిరుమలగిరిలోని వైన్స్‌కు 18 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.


