‘కపాస్ కిసాన్’పై అవగాహన కల్పించాలి
సూర్యాపేట : పత్తి రైతులు కపాస్ కిసాన్‌యాప్ ద్వారా స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి అధికారులను ఆదేశించారు. గురువారం సూర్యాపేట మండలం బాలెంలలోని మంజిత్ కాటన్ మిల్లును కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌తో కలిసి సందర్శించారు. మిషన్ ద్వారా పత్తి తేమ శాతాన్ని పరిశీలించి మాట్లాడారు. కాటన్ మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు పత్తి కొనుగోలు చేసేలా చూడాలన్నారు. ఈ సారి నూతన విధానంలో పత్తి కొనుగోలు చేయాలని సీసీఐ సూచనలు చేసిందన్నారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని పత్తిని విక్రయించవచ్చన్నారు. పత్తి రైతులు తమ ఫోన్ నంబర్లు అప్‌డేట్ చేసుకోవాలన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, మండల వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్ తదితరులు ఉన్నారు.
ఫ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి


