లెక్కలు అంటే భయం అవసరం లేదు
విద్యార్థులకు లెక్కలు అంటేనే ఎంతో భయం ఉంటుంది. మొదట ఈ భయం తొలగించుకోవాలి. గణితం ప్రధానంగా జామితీయ నిర్మాణాలు, గ్రాఫ్‌లు, సాంఖ్యకశాస్త్రం, సమితులు, సంభావ్యత చాప్టర్లపై కొద్ది గా సాధన చేస్తే మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంది. విద్యార్థులు త్రికోణమితి, సారూప త్రిభుజాలు, సర్కిల్ చాప్టర్లపై మరింత దృష్టి పెడితే ఎక్కువ మార్కులు సాధించవచ్చును. అకడమిక్ పుస్తకాలతో పాటు అభ్యాస దీపిక చదవడం వల్ల గణితంలో 100 మార్కులకు 100 సాధించవచ్చు.
– రవికుమార్,
గణితం ఉపాధ్యాయుడు, చిలుకూరు


