జాబ్‌మేళాను వినియోగించుకోవాలి
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్‌లో ఈనెల 25న నిర్వహించే మెగా జాబ్‌మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. హుజూర్‌నగర్ పట్టణంలోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్ నేషనల్ స్కూల్‌లో నిర్వహించే జాబ్ మేళా ఏర్పాట్లను ఎస్పీ కె. నరసింహ, నిర్వాహకులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కంపెనీల వారీగా స్టాల్స్ కేటాయింపుల వివరాలను అందజేయాలని సింగరేణి ప్రతినిధి చందర్‌ను ఆదేశించారు. అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఎక్కువగా రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. డిగ్రీ కళాశాల, మార్కెట్ యార్డ్, స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న వెంచర్‌లను పరిశీలించి పార్కింగ్‌తో పాటు కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. జాబ్ మేళా ప్రాంగణానికి అప్రోచ్ రోడ్లను వేయాలని, మొబైల్ టాయిలెట్స్, అభ్యర్థుల సౌక్యార్థం జిరాక్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడిని ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ ప్రూఫ్ టెంట్‌లను జాబ్ మేళా ప్రాంగణం, స్వర్ణ వేదిక పంక్షన్ హాల్ ప్రాంగణం, పార్కింగ్ ప్రదేశాలలో ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఆర్డీఓలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, డీఎస్‌పీ ప్రసన్న కుమార్, సింగరేణి ప్రతినిధి చందర్, జిల్లా ఉపాధి కల్పనాధికారి శంకర్, పరిశ్రమల జీఎం సీతారాం నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, నాయకులు సరోత్తంరెడ్డి, కొప్పల వేణారెడ్ది, తన్నీరు మల్లిఖార్జున్, చింతకుంట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి, దొంగరి వెంకటేశ్వర్లు, గెల్లి రవి, పోతు భాస్కర్, కె. కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


