అభ్యాస దీపికలు.. విద్యార్థులకు ఎంతో మేలు
చిలుకూరు: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం అభ్యాస దీపికలు అందించింది. వీటిని క్షుణ్ణంగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. వీటిద్వారా పాఠ్యాంశాలు సులువుగా అర్థం చేసుకోవడంతో పాటు విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని పలువురు సబ్జెక్టు టీచర్లు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా జెడ్పీ ఉన్నత పాఠశాలలు 182 , కేజీబీవీలు 18, ఆదర్శ పాఠశాలలు 9 ఉన్నాయి. వీటిలో 5,345 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 21,380 అభ్యాస దీపికలను విద్యార్థులకు పంపిణీ చేశారు. కేవలం గణితం, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రాలకు సంబంధించినవి ఇచ్చారు. ఈ అభ్యాస దీపికలపై ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు పలు సూచనలు అందించారు.
ఫ పదో తరగతి విద్యార్థులకు
21,380 అభ్యాస దీపికలు పంపిణీ
ఫ ఈ పుస్తకాలు బాగా చదివితే
మంచి మార్కులు సాధ్యం
ఫ విద్యార్థులకు సబ్జెక్టు
ఉపాధ్యాయుల సూచనలు


