నేరస్తులపై ప్రత్యేక నిఘా
అర్వపల్లి: జిల్లాలో నేరస్తులపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. అర్వపల్లి పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీచేశారు. రికార్డులను పరిశీలించి నేరాలు, ఇతర కేసులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఘర్షణలకు పాల్పడే వ్యక్తులు, వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి కేసులు నమోదు చేయాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా సత్వర న్యాయం చేయాలన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్లలో సమస్య పరిష్కారం కాలేదనుకుంటే సీఐ, డీఎస్పీల వద్దకు వెళ్లాలని అక్కడా న్యాయం జరగడంలేదని భావిస్తే ఎస్పీ కార్యాలయానికి రావాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ ఈట సైదులు, ఏఎస్‌ఐ రామకోటి, హెడ్‌కానిస్టేబుల్ సుధీర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


