బీసీ బంద్‌కు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

బీసీ బంద్‌కు సహకరించాలి

Oct 17 2025 6:18 AM | Updated on Oct 17 2025 6:18 AM

బీసీ బంద్‌కు సహకరించాలి

బీసీ బంద్‌కు సహకరించాలి

సూర్యాపేట : బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ బిల్లును 9వ షెడ్యూల్‌ చేర్చి పార్లమెంట్‌లో చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 18వ తేదీన బీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్‌కు జిల్లా వ్యాప్తంగా వాణిజ్య, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, హోటళ్లు సహకరించాలని పలు ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం సూర్యాపేటలోని ఓ హోటల్‌లో తెలంగాణ జన సమితి నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. రాజకీయ విద్య ఉద్యోగ అవకాశాలలో వెనుకబడిన తరగతుల వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బిల్లుకు పార్లమెంట్‌లో వెంటనే చట్టం చేయాలని కోరారు. తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్‌, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మందారి డేవిడ్‌ కుమార్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసంత సత్యనారాయణ పిళ్లే, నాయకులు చింతలపాటి శ్రీరాములు, అనంతుల మధు, మట్టిపల్లి సైదులు, బూర వెంకన్న, యాతాకుల రాజయ్య , చలమల నరసింహ, పొంగోటి రంగ, జనార్దన్‌, యాదగిరిరావ్‌, భద్రయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement