బీసీ బంద్‌కు పూర్తి మద్దతు
భానుపురి (సూర్యాపేట) : ఈనెల 18వ తేదీన బీసీ జేఏసీ నిర్వహించ తలపెట్టిన తెలంగాణ బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్‌లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని కోరారు.
విద్యార్థులు కళల్లోనూ
రాణించాలి
సూర్యాపేట టౌన్ : విద్యార్థులు చదువుతో పాటు వివిధ కళల్లోనూ రాణించాలని జిల్లా సైన్స్ అధికారి ఎల్.దేవరాజ్ సూచించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఫోక్ డ్యాన్స్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల్లో జిల్లాలోని తొమ్మిది పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో బాలభవన్ సూపరింటెండెంట్ రాధాకృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


