
మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
భానుపురి (సూర్యాపేట) : మహిళల ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు తగిన శ్రద్ధ వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. పోషణ మాసంలో భాగంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని ఫక్షన్‌హాల్లో నిర్వహించిన సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోషకాహారలోపం లేని సమాజాన్ని నిర్మించడమే పోషణ మాసం లక్ష్యమన్నారు. అందుకు కిందిస్థాయిలో కృషి చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లను అభినందించారు. గర్భిణుల పోషణలో ఆమె కుటుంబ సభ్యుఉల పాత్ర ఎంతో కీలకమన్నారు. బాల్య ఆరంభ దశ సంరక్షణ, విద్యపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహారావు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు.