
పార్టీకోసం పనిచేసేవారికి తగిన గుర్తింపు
కోదాడ: పార్టీ కోసం పని చేసే వారికి తగిన గుర్తింపు ఇస్తామని ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్ అన్నారు. బుధవారం కోదాడలోని కాశీనాథం ఫంక్షన్‌హాల్లో కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సంగతన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కిందిస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల అభిప్రాయం మేరకే పార్టీ పదవులు భర్తీ చేస్తామన్నారు. జిల్లా అధ్యక్షుల ఎన్నికలో కార్యకర్తల, నాయకుల అభిప్రాయాలను తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, కష్టపడే వారికి తగిన గుర్తింపు ఇవ్వడానికే అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి, చెవిటి వెంకన్నయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, నాయకులు సాముల శివారెడ్డి, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్