
రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం
చివ్వెంల: మొదటి నుంచి కూడా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఎం సీనియర్ నాయకుడు ఇట్టమళ్ల ఏసోబ్ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లును గవర్నర్, రాష్ట్రపతి ఆమోదించలేదన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న రాజ్యంగాన్ని మనువాద బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. రాజ్యంగ పరిరక్షణకు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. కేసీఆర్ అవలంబించిన విధానాన్నే రేవంత్ సర్కార్ అమలు చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు అమర వీరులు చూపిన బాటలో పయనించాలని పిలుపు నిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ జీవితాంతం పేదల అభ్యన్నతికి కృషిచేసిన మహనేత ఇట్టమళ్ల ఏసోబ్ అన్నారు. అనంతరం ఇట్టమళ్ల ఏసోబ్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు విరాళంగా ఇచ్చిన స్థలంలో సీపీఎం కార్యాలయ నిర్మాణానికి తమ్మినేని శంకుస్థాపన చేశారు. సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, వై.వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, సీపీఐ నాయకుడు ఖమ్మంపాటి అంతయ్య, ఇస్లావత్ రాంచందర్ నాయక్, ములకలపల్లి రాములు, పారేపల్లి శేఖర్‌రావు పాల్గొన్నారు.
ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
తమ్మినేని వీరభద్రం