
ఆపదలో ప్రాణాలు నిలిపే సీపీఆర్
ఈ నెల 13 నుంచి 17 వరకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాక్టర్లతో సీపీఆర్‌పై ప్రజలకు అవగాహన కల్పించనున్నాం. ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ సీపీఆర్‌పై అవగాహన కల్పించేలా ఐదురోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. సీపీఆర్‌పై అవగాహన ఉంటే తోటి మనిషి ప్రాణాలు కాపాడే అవకాశ ఉంటుంది.
– డాక్టర్ చంద్రశేఖర్,
డీఎంహెచ్‌ఓ, సూర్యాపేట
సూర్యాపేటటౌన్ : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ చేయడం వల్ల అతడి ప్రాణాలు కాపాడొచ్చు. సీపీఆర్ చేయడానికి వైద్యులే అవసరం లేదు, అవగాహన ఉన్న వారు చాలు. ఆగిన గుండెను తిరిగి పని చేయించే కార్డియో పల్మనరీ రిసస్కిటేషన్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం కోసం వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ఐదురోజుల పాటు జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
అధికమైన గుండెపోటు సమస్య
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు గుండెపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం, రోజువారీగా తీసుకునే ఆహారంలో మార్పులు, జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలు అధికంగా తినడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరాకు అడ్డు పడడం వల్ల చాలా మంది గుండెపోటు బారిన పడుతున్నారు. ఒక్కోసారి తీవ్రమైన ఒత్తడి వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తున్నది.
వెంటనే సీపీఆర్
చేస్తే ప్రయోజనం
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి కూడా ఒక్కోసారి సడెన్‌గా గుండె పనిచేయడం ఆగిపోతుంది. దానినే కార్డియాక్ అరెస్ట్ అంటారు. దాంతో వారు ఒక్కసారిగా ఉన్నచోటే కుప్పకూలిపోతారు. కొందరికి నొప్పి రాకుండానే గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అవగాహన ఉన్న వారు వెంటనే స్పందించి సీపీఆర్ చేస్తే వారి గుండె తిరిగి పని చేయడం ప్రారంభిస్తుంది. దాంతో అతడి ప్రాణాలు నిలిపి అవకాశం ఉంటుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ఛాతిపై రెండు అరచేతులు ఒకదానిపై ఒకటి ఉంచి హృదయ స్పందన తిరిగి ప్రారంభమయ్యేలా నొక్కుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అతను బతికే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.
విస్తృతంగా అవగాహన
సీపీఆర్‌పై జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు, మాల్స్, ఆస్పత్రులు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన అవగాహన కార్యక్రమాలు 17 వరకు కొనసాగనున్నాయి. వైద్యులు సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, పీహెచ్‌సీల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
ఫ అత్యవసరంలో అనుసరించాల్సిన
విధానంపై అవగాహన
ఫ జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో
స్పెషల్ డ్రైవ్
ఫ విద్యాసంస్థలు, ప్రభుత్వ
కార్యాలయాల్లో శిక్షణ