
ఆర్డీఆర్ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు
తుంగతుర్తి : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం తుంగతుర్తిలో దామోదర్‌రెడ్డి చిత్రపటానికి ఎంపీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుమారుడు సర్వోత్తంరెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన పార్టీని వీడలేదని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు తీగల గిరిధర్‌రెడ్డి, ఎల్సోజు చామంతినరేశ్, పలు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు దొంగరి గోవర్దన్, గుడిపాటి నరసయ్య, అవిలమల్లు యాదవ్, నాయకులు తిరుమలప్రగడ కిషన్‌రావు, పచ్చిపాల సుమతి, దాయం ఝాన్సీరాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి