
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి
సూర్యాపేటటౌన్/తిరుమలగిరి (తుంగతుర్తి) : విద్యార్థులు ఉన్నత ఆశయం, లక్ష్యాన్ని ఎంచుకొని, వాటి సాధనకు కష్టపడి చదువాలని ఎస్పీ కె.నరసింహ అన్నారు. పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తిరుమలగిరి మున్సిపాల్టీ పరిధిలోని మోడల్ పాఠశాలలో విద్యార్థులకు శాంతి భద్రతలు, చట్టాలు, మంచి ప్రవర్తన, విద్యార్థి ఉన్నత లక్ష్యాలు వంటి వాటిపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ప్రస్తుత సమాజంలో సైబర్ మోసాలు, మాదకద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా మారాయని, విద్యార్థులు వీటిపై పెద్దలకు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులు మంచి క్రమశిక్షణతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. ఇంటర్నెట్‌ను నాలెడ్జ్ కోసం మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు వెంకటయ్య, నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, ప్రిన్సిపాల్స్ యాదయ్య, సంజీవ్‌కుమార్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ

విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి