
విద్యా కల్పవృక్షం.. ఎంజీయూ
ప్రత్యేక కథనం
8లో
ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
విద్యార్థినిని వేధిస్తున్న ఓ ఉపాధ్యాయుడిపై నకిరేకల్ పోలీసులు శనివారం పోక్సో కేసు నమోదు చేశారు.
పూర్తిస్థాయి నీటి మట్టం :
590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 589.70 అడుగులు
ఇన్‌ఫ్లో : 2,81,352 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 2,60,602 క్యూసెక్కులు
విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 32,764 క్యూసెక్కులు
కుడికాల్వ ద్వారా : 9,019 క్యూసెక్కులు
ఎడమకాల్వ ద్వారా : 6,325 క్యూసెక్కులు
ఏఎమ్మార్పీకి : 2,400 క్యూసెక్కులు
వరద కాల్వకు : 300 క్యూసెక్కులు
- 8లో
మట్టపల్లిలో విశేషపూజలు
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపారు. ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం అనంతరం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణలతో వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.