
పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్
చివ్వెంల(సూర్యాపేట) : పెడింగ్ కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో ఆమె పాల్గొని మాట్లాడారు. చిన్న చిన్న ఘర్షణలకు కోర్టు మెట్లు ఎక్కకుండా గ్రామాల్లోనే పరిష్కరించుకోవాలని సూచించారు. దీని వల్ల ఇరు వర్గాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ఐదు బెంచీల ద్వారా నిర్వహించిన కేసుల్లో క్రిమినల్1944, సివిల్ 53, పీఎల్‌సీ214, మొత్తం 2,211 కేసులు పరిష్కారమైనట్లు వివరించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కక్షిదారులకు పులిహోర ప్యాకెట్లు అందజేచేయగా, వాటిని న్యాయమూర్తుల చేతుల మీదుగా కక్షిదారులకు ఇచ్చారు. ఈకార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి నాగ అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ బి.వెంకటరమణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డీఎస్‌పీ ప్రసన్నకుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.