
గంటలకొదీ్ద నిరీక్షణ..
ఏపూరులో తోపులాట
తిరుమలగిరి(తుంగతుర్తి): రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. జిల్లాలో ప్రతిరోజూ ఏదోఒక పీఏసీఎస్, మనగ్రోమోర్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు ఎగబడగుతున్నారు. శుక్రవారం పలు మండలాల్లోని పీఏసీఎస్, ఆగ్రోస్ కేంద్రాల వద్దకు తెల్లవారుజామునే వచ్చి లైన్‌లో నిలబడ్డారు. కొందరు లైన్‌లో నిలబడలేక పాస్‌బుక్కులు, ఆధార్‌కార్డులు, చెప్పులను పెట్టి తమ వంతు వచ్చేదాకా నిరీక్షించారు. చివరికి కొందరికే ఒక బస్తా యూరియా లభిస్తుండగా మరికొందరు అదికూడా దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వం స్పందించి తమకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని రైతులు వేడుకుంటున్నారు. శుక్రవారం తిరుమలగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా లోడ్ రావడంతో ఉదయం నుంచే రైతులు బారులుదీరారు. గతంలో టోకెన్లు ఇచ్చిన రైతులకు ఒక్కొక్కరికి రెండు యూరియా బస్తాలు ఇచ్చారు.
తెల్లవారుజాము నుంచి క్యూకట్టినా
కొందరికే యూరియా
అర్వపల్లి: సూర్యాపేట జిల్లా అర్వపల్లి పీఏసీఎస్ ఎదుట యూరియా కోసం రైతులు శుక్రవారం తెల్లవారు జామునుంచే క్యూలైన్లలో ఉన్నారు. 450 బస్తాల యూరియా రాగా క్యూలైన్లో ఉన్న కొందరికే యూరియా దొరికింది. సుమారు 200 మంది రైతుల వరకు వెనుదిరిగి పోయారు.
మద్దిరాలలో టోకెన్ల కోసం..
మద్దిరాల : మద్దిరాలలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద శుక్రవారం యూరియా కోసం రైతులు బారులుదీరారు. చాలా మంది ధర్నాకు యత్నించారు. స్థానిక ఎస్‌ఐ వీరన్న కలుగజేసుకుని టోకెన్లు ఉన్న రైతులకు ఇచ్చాకే మిగిలిన వారికి ఇస్తామనడంతో టోకెన్లకు ఎగబడ్డారు.
బరాఖత్‌గూడెంలో ఎగబడిన రైతులు
మునగాల: మునగాల పీఏసీఎస్‌కు శుక్రవారం 222 బస్టాల యూరియా రావడంతో బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన రైతులకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులకు టోకెన్లు ఇచ్చి మునగాలలోని సొసైటీ గోదాము వద్ద ఒక్కో రైతుకు ఒక యూరియా బస్తా పంపీణీ చేశారు. కాగా శనివారం మునగాల పీఏసీఎస్‌కు వచ్చే యూరియాను మునగాల రైతులకు ఇస్తామని సొసైటీ కార్యదర్శి బసవయ్య తెలిపారు.
లైన్‌లో పాస్‌బుక్కులు పెట్టి..
చిలుకూరు: చిలుకూరు పీఏసీఎస్ పరిధిలోని దూదియాతండాలో గల గోదాముకు శుక్రవారం యూరియా బస్తాలు వచ్చాయి. దీంతో రైతులు ఉదయం ఆరు గంటలకే గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని పట్టాదారు పాస్‌బుక్కులు, ఆధార్ కార్డు జిరాక్స్‌లను క్యూలో పెట్టారు. క్యూలో నిలబడిన రైతులకు ఒక్కో బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు.
ఆత్మకూర్ (ఎస్) : ఆత్మకూర్, ఏపూరు పీఏసీఎస్ కేంద్రాల వద్ద రైతులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే యూరియా కోసం క్యూలైన్లో కూర్చున్నారు. ఆత్మకూరు కేంద్రంలో సాయంత్రం 4 గంటల వరకు రైతులు ఎదురుచూసి వెనుతిరిగారు. ఏపూరులో 444 బస్తాలు పంపిణీ చేశారు. ఇక్కడికి పెద్ద సంఖ్యలో రైతులు చేరడంతో పంపిణీ సమయంలో స్వల్ప తోపులాట జరిగింది.
యూరియా కోసం రైతులకు తప్పని అవస్థలు
ఫ పీఏసీఎస్, మన గ్రోమోర్ కేంద్రాల
వద్ద రోజూ బారులే
ఫ పొద్దస్తమానం లైన్‌లో ఉన్నా
కొందరికే యూరియా
ఫ సరిపడా అందించాలని వేడుకోలు

గంటలకొదీ్ద నిరీక్షణ..

గంటలకొదీ్ద నిరీక్షణ..