
అదనపు కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
భానుపురి (సూర్యాపేట): జిల్లా అదనపు కలెక్టర్‌గా కొత్తగా నియామకమైన కొలనుపాక సీతారామారావు శుక్రవారం కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. అంతకు ముందు అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీతారామారావు ఇటీవల నల్లగొండ జిల్లా స్పెషల్ కలెక్టర్ (ఐ–క్యాడ్)గా విధులు నిర్వహిస్తూ అదనపు కలెక్టర్‌గా సూర్యాపేటకు బదిలీపై వచ్చారు.
25, 26 తేదీల్లో పీవైఎల్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు
కోదాడరూరల్ : ఈ నెల 25, 26 తేదీల్లో కోదాడ పట్టణంలోని లాల్‌బంగ్లాలో నిర్వహించ తలపెట్టిన పీవైఎల్ (ప్రగతిశీల యువజన సంఘం) రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోకాళ్ల రమేష్, కోలా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని లాల్‌బంగాల్లో ఎదుట శిక్షణ తరగతుల కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య, ప్రధాన కార్యదర్శి ధరావత్ రవి, సహాయ కార్యదర్శి వీరబోయిన రమేష్, కోశాధికారి బండి రవి పాల్గొన్నారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
చివ్వెంల: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టుతో పాటు, హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తి కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గోండ్రియాల పీఏసీఎస్ చైర్మన్‌గా నర్సింహారెడ్డి
అనంతగిరి : మండలంలోని గోండ్రియాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా లక్కవరం గ్రామానికి చెందిన బుర్రా నర్సింహారెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మాజీ చైర్మన్‌ను తొలగిస్తూ నూతన చైర్మన్‌గా నర్సింహారెడ్డిని నియమిస్తూ జిల్లా సహకార అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. మూడోసారి సహకార సంఘం చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్రా పుల్లారెడ్డి, డైరెక్టర్లు వాడకొప్పుల పూర్ణయ్య, నెల్లూరి వెంకటప్పయ్య, ఏలూరి నాగయ్య, నెల్లూరి నర్సింహారావు, చుంచు లక్ష్మి, మాగి యాకోబు, బట్టా కొండల్‌రావు, బానోతు రాము, యేసోబు పాల్గొన్నారు.
ఉద్యాన పంటల
సాగుకు ప్రోత్సాహం
ఆత్మకూర్ (ఎస్) : ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహం అందిస్తామని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య అన్నారు. శుక్రవారం ఆత్మకూర్(ఎస్) మండలంలోని ఏపూర్ గ్రామంలో సాగవుతున్న ఉద్యాన పంటలను సందర్శించి మాట్లాడారు. ఉద్యాన పంటల్లో కలుపు నివారణకు మల్చింగ్ పేపర్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎకరానికి 8వేల రూపాలయ చొప్పున సబ్సిడీ అందింస్తామన్నారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఉద్యాన అధికారి కట్ట స్వాతి, ఉద్యాన విస్తరణ అధికారి ఏ.లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్ బాధ్యతల స్వీకరణ

అదనపు కలెక్టర్ బాధ్యతల స్వీకరణ