
సీతారాం ఏచూరి స్ఫూర్తితో ఉద్యమించాలి
సూర్యాపేట అర్బన్ : సీపీఎం జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, దివంగత నేత సీతారాం ఏచూరి స్ఫూర్తితో మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. భారతదేశ రాజకీయ రంగంలో కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ యోధుల్లో సీతారాం ఏచూరి ఒకరన్నారు. సీతారాం ఏచూరి ఆశయాల సాధనకు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, నాయకులు కందాల శంకర్‌రెడ్డి, బుర్ర శ్రీనివాస్, ఎల్గూరి గోవింద్, పులుసు సత్యం, జె నరసింహారావు, వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, కొప్పుల రజిత పాల్గొన్నారు.