
70 శాతం మార్కులు వచ్చేలా చూడాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతి సబ్జెక్టులో కనీసం 70 శాతం మార్కులు వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూళ్లు, వెల్ఫేర్ కళాశాలలు, కేజీబీవీల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల మీద నమ్మకంతో విద్యార్థులు వస్తున్నారని, వారికి అర్థమయ్యేలా బోధించి ఉన్నత శిఖ రాలకు చేరేలా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతం పెంచాలన్నారు. ఈ సమావేశంలో డీఐఈఓ భానునాయక్, జీసీడీఓ పూలన్, డీసీఓలు పద్మ, లక్ష్మి, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.