పోరాటానికి కేంద్ర బిందువు నల్లగొండ | - | Sakshi
Sakshi News home page

పోరాటానికి కేంద్ర బిందువు నల్లగొండ

Sep 13 2025 7:39 AM | Updated on Sep 13 2025 7:39 AM

పోరాట

పోరాటానికి కేంద్ర బిందువు నల్లగొండ

శాలిగౌరారం : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్రబిందువు ఉమ్మడి నల్లగొండ జిల్లా అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. సాయుధ పోరాటంలో అసువులు బాసిన వల్లాల గ్రామానికి చెందిన 10 మంది అమరవీరుల స్మారకార్థం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు సొంత ఖర్చులతో నిర్మించిన స్మారక స్థూపాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. వల్లాల ఘటనను వెలుగులోకి తీసుకువచ్చి, అమరవీరులకు స్మారక స్థూపాన్ని నిర్మించిన వి.హన్మంతరావు కృషి ప్రతీ ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. కాంగ్రెస్‌, కమ్మూనిస్టులు సిద్ధాంతపరంగా తలబడినా తెలంగాణ సాయుధ పోరాటంలో కలిసి ముందుకుసాగి విజయం సాధించారని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ..దేశ చరిత్రను తారుమారు చేసే పనిలో నిమగ్నమైందని విమర్శించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గానీ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో గానీ, హైదరాబాద్‌ విలీనంలో గానీ బీజేపీ పాత్ర, పోరాటం ఏమిటో, ఎవరైనా ఆ ఉద్యమాల్లో పాల్గొన్నారో ఆ పార్టీ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. సాయుధ పోరాట అమరవీరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. అమరవీరుల కుటింబీకులు నిర్మించుకునే ఇందిరమ్మ ఇళ్లకు తాను వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందిస్తానని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రకటించారు. వల్లాలోని పురాతన పాఠశాలను అభివృద్ధి పర్చాలని ఎమ్మెల్యే మందుల సామేల్‌.. పీసీసీ అధ్యక్షుడిని కోరగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా చర్చించి వల్లాలకు వన్నెతెచ్చే విధంగా మోడల్‌ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషిచేస్తానన్నారు. అనంతరం అమరవీరుల కుటింభీకులను పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్‌ అద్యక్షతన జరిగిన ఈ సభలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్‌, మాజీమంత్రి కుందూరు జానా రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్‌, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నేతివిద్యాసాగర్‌, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, సూర్యాపేట డీసీసీ అద్యక్షుడు చెవిటి వెంకన్న, నాయకులు గుడిపాటి నర్సయ్య, నూక కిరణ్‌, అన్నెబోయిన సుధాకర్‌, గంట్ల వేణుగోపాల్‌రెడ్డి, దండ అశోక్‌రెడ్డి, కందాల సమరంరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాదూరి శంకర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ తాళ్లూరి మురళి, బొల్లికొండ గణేశ్‌, ఇంతియాజ్‌తదితరులు పాల్గొన్నారు.

ఫ చరిత్రను తారుమారు చేసే

పనిలో బీజేపీ ఉంది

ఫ పీీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఫ వల్లాలతో అమరవీరుల స్మారకస్థూపం ఆవిష్కరణ

పోరాటానికి కేంద్ర బిందువు నల్లగొండ1
1/1

పోరాటానికి కేంద్ర బిందువు నల్లగొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement