
మహిళలకు చట్టాలపై అవగాహన అవసరం
చివ్వెంల(సూర్యాపేట) : మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండడం అవసరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. గురువారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా మహిళల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, సామాజిక ఎదుగుదల వంటి అంశాలను వివరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్‌రావు, న్యాయవాదులు అనంతుల సందీప్ కుమార్, కట్ట సుధాకర్ పాల్గొన్నారు.