
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ఏపీ ప్రభుత్వం
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడం సరైన పద్ధతి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం సాక్షి ఎడిటర్‌పై అక్రమంగా కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయ నిపుణుల సలహా మేరకు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం ఉందని అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి తనిఖీలు చేయడం మంచి పద్ధతికాదు. సాక్షి ఎడిటర్‌పై నమోదు చేసిన పోలీస్ కేసులను ఏపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.
– వజ్జె వీరయ్య యాదవ్, టీయూడబ్ల్యూజే(హెచ్ 143) జిల్లా అధ్యక్షుడు
పత్రికలు అనేవి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పని చేస్తాయి. అలాంటి పత్రికలను ప్రభుత్వాలు అణచివేసే కుట్ర చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. పత్రికా విలేకరులను గౌరవించాలి, వారికి స్వేచ్ఛనివ్వాలి. – బడుగుల లింగయ్య యాదవ్,
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు

పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ఏపీ ప్రభుత్వం

పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ఏపీ ప్రభుత్వం