
కక్షసాధింపు సిగ్గుచేటు
ప్రభుత్వాలు హుందాతనంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలి. ప్రతిపక్షాలు, జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలతో సాక్షి కార్యాలయాలపై దాడులు చేయించడం మంచిది కాదు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన ప్రభుత్వాలు ఎక్కువ రోజులు మనుగడ సాగించలేవు. ఆంధ్రప్రదేశ్‌లోని సాక్షి కార్యాలయాల్లో తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురి చేయడం జర్నలిజం గొంతునొక్కే ప్రయత్నమే. ప్రజా సమస్యలను లెవనెత్తిన సాక్షి యాజమాన్యంపై కక్ష సాధింపు సిగ్గుచేటు.
– చెవిటి వెంకన్నయాదవ్,
డీసీసీ అధ్యక్షుడు, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు