
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మీడియాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది. దేశ స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో మీడియా ప్రధాన భూమిక పోషించింది. ప్రస్తుతం బీజేపీ, సంబంధిత పొత్తుల పార్టీలు కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ మీడియా వాళ్ల గొంతు నొక్కుతున్నారు. నాలుగో స్తంభమైన మీడియాను కాపాడే పోలీసులే అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయి. దీనిని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోంది.
– బెజవాడ వెంకటేశ్వర్లు , సీపీఐ జిల్లా కార్యదర్శి