
సమస్యలను పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో నెలకొన్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి కోరారు. గురువారం ఈ మేరకు సూర్యాపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాదాపు 11 సమస్యలపై సమగ్రమైన సమాచారంతో వినతిపత్రం అందిస్తున్నామని, వీటన్నింటినీ పరిష్కరించాలని కోరారు. హుజూర్‌నగర్‌లో ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తుక్కాని మన్మథరెడ్డి, వంగవీటి శ్రీనివాసరావు, దండా మురళీధర్‌రెడ్డి, తాళ్ల నరేందర్‌రెడ్డి, జల్లా జనా ర్దన్, వెంకటేశ్వర్లు, మహేష్, ఫణినాయు డు, ఉ ప్పలచారి, గురవయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
13న జాతీయ
లోక్ అదాలత్
సూర్యాపేటటౌన్ : ఈనెల 13న జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కె. నర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజీ మార్గమే రాజమార్గమని , రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు సానుకూలంగా ఉండాలని సూచించారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్‌అదాలత్ అనేది ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. అనవసర గొడవలకు, పట్టింపులకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని హితవు పలికారు.
అర్హతలేకున్నా వైద్యం చేస్తే కఠినచర్యలు తీసుకుంటాం
హుజూర్‌నగర్ : అర్హత లేకున్నా వైద్యం చేస్తే క్లినిక్‌ను సీజ్ చేయడమే కాకుండా కఠినచర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం హుజూర్‌నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామంలో క్లినిక్‌ను తనిఖీ చేశారు. ఎలాంటి వైద్యవిద్య, అర్హతలు లేకుండా వట్టికూటి రాంబాబు ఆ గ్రామంలో నిర్వహిస్తున్న క్లినిక్‌ను డీఎంహెచ్‌ఓ తనిఖీ చేసిన అంతరం సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ అన్ని రకాల విద్యార్హతలు కలిగి ఉండి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతనే అల్లోపతి ప్రాక్టీస్‌కు అర్హత ఉంటుందని ఆయన తెలిపారు. తనిఖీ బృందంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డాక్టర్ జయమనోహరి, డాక్టర్ జి. చంద్రశేఖర్, వైద్యాధికారులు డాక్టర్ నాజియా తబస్సుమ్, డాక్టర్ వేణుగోపాల్, డిప్యూటీ డెమొ వి. సంజీవ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

సమస్యలను పరిష్కరించాలి