
మీడియా గొంతు నొక్కుతున్న ప్రభుత్వం
ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాపాడేది మీడియా. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ లబ్ధి కోసం అక్కడి ప్రభుత్వం మీడియా సంస్థల గొంతు నొక్కుతోంది. మీడియా ప్రతినిధులకే రక్షణ కరువు అయితే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్య విలువలను తుంగలోతొక్కి నిరంకుశత్వాన్ని ప్రదర్శించడం చట్టవిరుద్ధం. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మీడియా సంస్థలను, ప్రతినిధులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన ఉంది. అక్కడి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.
–మల్లు నాగార్జున రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి