
మీడియా స్వేచ్ఛను హరించే అధికారం ప్రభుత్వానికి లేదు
ప్రజలు, ఉద్యోగుల తరఫున ప్రశ్నించే హక్కు మీడియాకు ఉంటుంది. మీడియా స్వేచ్ఛను హరించే హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. అక్రమ కేసులు, భౌతికదాడులు, బెదిరింపులతో మీడియా స్వేచ్ఛను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు. తమకు అనుకూలంగా వార్తలు రాయలేదనే కారణంతో నచ్చని మీడియా కార్యాలయాలపై దాడులకు దిగడాన్ని, ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ తీరు మార్చుకోకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలతో కలిసి ప్రత్యక్ష ఆందోళన చేస్తాం. తప్పుడు కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.
– గార్లపాటి కృష్ణారెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు